Arunachala Siva Aksharamala Lyrics

Arunachala Siva Aksharamala Lyrics – అరుణాచల శివ అరుణాచల శివ – Bhagwan Ramana Maharshi

Pavan Photo Laminations Arunachala Shiva Annamalaiyar Unnamalaiyar Wall Painting Framed Home Decor (Wood,Matte,Gold,Small Size,6 x 8 Inch) R128S: Buy Online at Best Price in UAE - Amazon.ae

Arunachala Siva Aksharamala – అరుణాచల శివ అరుణాచల శివ

Lyrics in Telugu

సాక్షాదరుణగిరీశ్వర వరార్హమగు నక్షరమణమాల నమరించుటకును

కరుణాకరుండగు గణపతి యొసగి కరమ భయకరము కాపాడుగాక

అరుణాచల శివ ||3|| అరుణాచలా ||2||

అరుణాచల మనుచు స్మరియించువారల

అహము నిర్మూలింపు అరుణాచలా | 1 |

అళగు సుందరముల వలె చేరి నేను

నీ వు౦దమభిన్నమై అరుణాచలా | 2 |

లోదూరి లాగి నీ లోగుహను చెరగా

నమరించి తేమొకో అరుణాచలా | 3 |

ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన

అఖిలము నిందించు అరుణాచలా | 4 |

ఈ నింద తప్పు నిన్నేటికి దలపించితిక

విడువారెవరరు అరుణాచలా | 5 |

కనిన జనని కన్న ఘనదయాదాయకా

ఇదియా యనుగ్రహము అరుణాచలా | 6 |

నిన్నేమార్చి యరుగనీక యుల్లము

పైని నురుదిగా నుండుమా అరుణాచలా | 7 |

ఊరూరు తిరుగక యుల్లము నిను గని

యణగ నీ ద్యుతి జూపుము అరుణాచలా | 8 |

నను చెరచి యిపుడు నను కలియక

విడుటిది మగతన మొక్కొయా అరుణాచలా | 9 |

ఏటి కీ నిదుర నన్నితరులు లాగగ

ఇది నీకు న్యాయమా అరుణాచలా | 10 |

పంచేంద్రియ ఖలులు మదిలోన

దూరుచో మదిని నీవుందవో అరుణాచలా | 11 |

ఒకడవౌ నిను మాయ మొనరించి

వచ్చువారెవరిది నీ జాలము అరుణాచలా | 12 |

అరుణాచల శివ ||3|| అరుణాచలా ||2||

Om Namah Shiva

ఓంకార వాక్యార్ధ యుత్తమ సమహీన

నిన్నెవరెరుగువారు అరుణాచలా | 13 |

అవ్వబోలె నొసగి నాకు నీ కరుణ

నన్నేలుట నీ భారము అరుణాచలా | 14 |

కన్నుకు గన్నయి కన్నులేక కను

నిను కనువారెవరుగనుము అరుణాచలా | 15 |

ఇనుము ఆయస్కాంతము వలె గవిసి

నను విడువక కలసి నాతోనుండుము అరుణాచలా | 16 |

గిరి రూప మైనట్టి కరుణా సముద్రమా

కృప చేసి నన్నేలుం అరుణాచలా | 17 |

క్రింద మీదెటను చెన్నొందు కిరణమణి

నా క్రిందు గతి మాపు అరుణాచలా | 18 |

కుట్ర యంతయు గోసి గుణముగ బాలించు

గురు రూపమై వెలుగు అరుణాచలా | 19 |

కూచి వాల్గన్నుల కోతబడక

కృప చేసి నన్ చేరి కావుం అరుణాచలా | 20 |

వంచకా వేడియున్ గొంచెమున్

గరగవే అభయ మంచేలుమా అరుణాచలా | 21 |

అడుగకిచ్చెడు నీదు నకళంక మగు

కీర్తి హాని సేయక బ్రోవు అరుణాచలా | 22 |

హస్తలమలక నీదు సద్రసమున

సుఖోన్మాద మొందగ నేలు అరుణాచలా | 23 |

వల నుంచి భక్తుల పరిమార్చు ని

ను గట్టుకొని యెట్లు జీవింతును అరుణాచలా | 24 |

అరుణాచల శివ ||3|| అరుణాచలా ||2||

Om Namah Shiva

కోపరహిత గుణ గురిగాగ నను

గొను కొరయేమి చేసితి అరుణాచలా | 25 |

గౌతమ పూజిత కరుణా ఘన నగమా

కడ గంట ఏలుమా అరుణాచలా | 26 |

సకలము కబళించు కరకాంతియిన

మనో జలజ మరల్పుమా అరుణాచలా | 27 |

తిండిని నిన్జేరితిని తిన నా నేను

శాంతమై పోవుదును అరుణాచలా | 28 |

మది చల్లపడ భద్రకర ముంచి యమృతనోర్

తెరు మనుగ్రహచంద్ర అరుణాచలా | 29 |

వన్నెను చెరచి నిర్వాణ మొనర్చి

కృపావన్నె నిడి బ్రోవుమరుణాచలా | 30 |

సుఖ సముద్రము పొంగ వాక్ మనమ్ములడంగ

నూరక నమరు మందరుణాచలా | 31 |

వంచింతువేల నన్ శోధింపకిక నీదు

జ్యోతి రూపము చూపుం అరుణాచలా | 32 |

పరవిద్య గరపి యీ భూమి మైకము వీడి

రూపగు విద్య జూపు అరుణాచలా | 33 |

చేరకున్నను మేను నీరుగ గరగి

కన్నీటేరయి నశింతు అరుణాచలా | 34 |

ఛీ యని ద్రోసిన చేయు కర్మ

తపన గాకేది మను మారం అరుణాచలా | 35 |

చెప్పక చెపి నీవు మౌనత నుండని

యూరక యుందువే అరుణాచలా | 36 |

అరుణాచల శివ ||3|| అరుణాచలా ||2||

Om Namah Shiva

సోమరి నైతిని మిన్నని సుఖ నిద్ర కన్న

వేరెది గతి అరుణాచలా | 37 |

శౌర్యము జూపితి శమియించె నని

మాయ చలియి౦ప కున్నావు అరుణాచలా | 38 |

కుక్కకు న్నీచమే నేనే గురుతుగొని

వెదకి నిన్జేరుదు అరుణాచలా | 39 |

జ్ఞానము లేక నీ యాస దైన్యము బాప

జ్ఞానము దెల్పి బ్రోవుమరుణాచలా | 40 |

తేటి వలెను నీవు వికసింప లేదని

యెదుట నిలుతువేల అరుణాచలా | 41 |

తత్వ మెరుగజాల నంతయై నిలుతువే

యిదియేమి తత్వమో అరుణాచలా | 42 |

తా నేను తానను తత్వ మిద్దానిని

తానుగా చూపింతు అరుణాచలా | 43 |

త్రిప్పి యహంతను నెప్పుడు లో ద్రుష్టి గన

దెలియు ననునదే అరుణాచలా | 44 |

తీరముండని యెద వెదకియు నిన్ను నే

తిరిగి పొందితి బ్రోవు మరుణాచలా | 45 |

సత్య జ్ఞానము లేని యీ జన్మ ఫలమేమి

యొప్పగ రావేల అరుణాచలా | 46 |

శుద్ధ వాంగ్మన యుతులం దోచు నీ నిజా హంత

గల్పి నను బ్రోవు అరుణాచలా | 47 |

దైవ మనుచు నిన్ను దరిచేరగా నన్ను

పూర్ణ నాశ మొనర్చితి అరుణాచలా | 48 |

అరుణాచల శివ ||3|| అరుణాచలా ||2||

Om Namah Shiva

వెదుకక గనిన సచ్చ్రీయనుగ్రహనిధి

మది తెగుల్ తీర్చి బ్రోవు అరుణాచలా | 49 |

ధైర్యము పరుగిడు నీ నిజహమరయ నే

నాశమైతి బ్రోవు అరుణాచలా | 50 |

తాకి కృపాకరము నను గలియకున్న

నిజము నశింతు బ్రోవు అరుణాచలా | 51 |

దోషరహిత నీవు నాతో నైక్యమయి

నిత్యానంద మయమోనర్పరుణాచలా | 52 |

నగకు నెడముకాదు నిన్వెదకిన నన్ను

గను కృపానగ వేసి అరుణాచలా | 53 |

నాన లేదె వెదుక నేనయి నీ వొంటి

స్థాణువై నిలిచితివి అరుణాచలా | 54 |

నీ జ్వాల గాల్చినన్ నీరు సేసెడు మున్నె నీ

కృప వర్షింపు అరుణాచలా | 55 |

నీవు నే నణగ నిత్యానందమయముగా

నిలుచు స్థితి కరుణి౦పు అరుణాచలా | 56 |

అణురూపు నిన్ను నే మిన్ను రూపుం చేర

భావోర్ములెపుడాగు అరుణాచలా | 57 |

సూత్ర జ్ఞానము లేని పామరు నా మాయా

జ్ఞానము కోసికావు అరుణాచలా | 58 |

మక్కి మక్కి కరగి నే నిన్ను శరణంద

నగ్నుడవై నిల్చితి అరుణాచలా | 59 |

నేస్తముండని నాకు నీ యాశ చూపినన్

మోసగింపక బ్రోవు అరుణాచలా | 60 |

అరుణాచల శివ ||3|| అరుణాచలా ||2||

Om Namah Shiva

నవసి చెడు ఫలము నందేమి ఫల మేరి

పక్వత లోగొను అరుణాచలా | 61 |

నొవ్వగింపకను నిన్ను నొసగి నన్ గోనలేదె

యంతకుడవు నాకు అరుణాచలా | 62 |

చూచి చింతించి మేనుం దాకించి పక్వము చేసి

నీ వేలి బ్రోవుం అరుణాచలా | 63 |

మాయ విషము పట్టి తలకెక్కి చెడుమున్నె కరుణ

పటోసగిబ్రోవుం అరుణాచలా | 64 |

కను కృపన్ మాయాంతముగా కృప గనవేమి

గను నీ కెవరు చెప్పుటెవరు అరుణాచలా | 65 |

పిచ్చి వీడ నినుబోలె పిచ్చి చేసితె దయన్

పిచ్చిని మాన్పుము అరుణాచలా | 66 |

నిర్భీతి నిను జేరు నిర్భీతు నను జేర

భీతి నీకేలకో అరుణాచలా | 67 |

అల్ప జ్ఞాన మదేది సుజ్ఞాన మేదయా

ఐక్య మంద కరుణింపు అరుణాచలా | 68 |

భూగంధమగు మది పూర్ణ గంధము గొన

బూర్ణ గంధ మొసంగు అరుణాచలా | 69 |

పేరు తలపగనే పట్టి లాగితివి నీ

మహిమ కనుదురెవరు అరుణాచలా | 70 |

పోగ భూతము పోని భూతమై పట్టినన్

భూతగ్రస్తుని చేసి తరుణాచలా | 71 |

మృదులతన్ నే బ్రాపు లేక వాడగనీక

పట్టు కొమ్మయి కావు అరుణాచలా | 72 |

అరుణాచల శివ ||3|| అరుణాచలా ||2||

Om Namah Shiva

పొడిచే మయికపర్చి నా బోధ హరియించి

నీ బోధ గనుపించితి అరుణాచలా | 73 |

పోకరాకలు లేని సమరంగ దివి జూపు

మా కృపాపోరాటం అరుణాచలా | 74 |

భౌతిక మౌ మేని పట్టార్చి యెపుడు

నీ మహిమ గన గరునిణింపు అరుణాచలా | 75 |

మలమందు నీవియ్య మలమగుటయో

కృపా మలమందువై వెలుగు అరుణాచలా | 76 |

మానము గొని చేరువారి మానము బాపి

నిరభిమానత వెలుగు అరుణాచలా | 77 |

మించగా వేడెడు కించిజ్ఞుడను

నను వంచింపకను బ్రోవుమరుణాచలా | 78 |

నావికుడుండగ పెనుగాలి నలయు

నావను గాక కాచి బ్రోవుం అరుణాచలా | 79 |

ముడిమూలముల్ గాన మునుకొంటివి

సరిగ ముగియ భారము లేదొ అరుణాచలా | 80 |

ముక్కిడి మును జూపు ముకురము గాక

నన్ హెచ్చించి కౌగలింపు అరుణాచలా | 81 |

సత్యాహమున మనో మృదు పుష్ప శయ్యపై

మేన్గలయ గరుణింపు అరుణాచలా | 82 |

మీదు మీదుగ మ్రొక్కు భక్తుల జేరి

నీ వందితే మేలిమి అరుణాచలా | 83 |

మై మై దణచి క్రుపాంజనమున

నీ సత్య వశ మొనరించితి అరుణాచలా | 84 |

అరుణాచల శివ ||3|| అరుణాచలా ||2||

Om Namah Shiva

మొగ్గ పరిపి నను బట్ట బయట నీవు

నట్టాడు టేలొకో అరుణాచలా | 85 |

మోహము ద్రప్పి నీ మోహ మొనర్చి

నా మోహము తీరదా అరుణాచలా | 86 |

మౌనియై రాయిగా నలరక యున్నచో

మౌన మిది యగునో అరుణాచలా | 87 |

ఎవరు నా నోటిలో మన్నును గొట్టి నా

బ్రతుకును హరించినది అరుణాచలా | 88 |

ఎవరు గనక నాడు మదిని మైకపరచి

కొల్లగొనిన దెవరు అరుణాచలా | 89 |

రమణుడనుచు నంటి రోషము గొనకనన్

రమియింప చేయరమ్ము అరుణాచలా | 90 |

రేయింబవలు లేని బట్ట బయట యింట

రమియింపగా రమ్ము అరుణాచలా | 91 |

లక్ష్యముంచి యనుగ్రహాస్త్రము వైచి

నన్ గబళించి తుసురుతో అరుణాచలా | 92 |

లాభమీ విహపర లాభ హీనుని చేరి

లాభ మే మందితీవి అరుణాచలా | 93 |

రమ్మని యనలేదే వచ్చి నావంతివ్వ

వెరకు నీ తలవిధి అరుణాచలా | 94 |

రమ్మని లోదూరి నీ జీవ మిడునాడే

నా జీవమును బాసి తరుణాచలా | 95 |

విడిచిన కష్టమౌ విడాక నిన్నుసురును

విడువ ననుగ్రహింపు అరుణాచలా | 96 |

అరుణాచల శివ ||3|| అరుణాచలా ||2||

Om Namah Shiva

ఇల్లు విడువ లాగి లోనింటిలో జొచ్చి

యొగి నీదు నిలు చూపితరుణాచలా | 97 |

వెలిపుచ్చితి న్నీదు సేత కినియక

నీ కృప వెలిబుచ్చి కావు అరుణాచలా | 98 |

వేదాంతమున వేరు లేక వెలింగెడు

వేద పదము బ్రోవుం అరుణాచలా | 99 |

నింద నాశీస్సుగా గొని

దయాపాత్రుగా చేసి విడక కావు అరుణాచలా | 100 |

నీట హిమముగా ప్రేమకారు నీలో

నన్ ప్రేమగ కరగి బ్రోవు అరుణాచలా | 101 |

అరుణాద్రి యన నే కృపావల బడితి

దప్పునె నీ కృపావల అరుణాచలా | 102 |

చింతింప కృపపడ సాలీడు వలె గట్టి

చెరపెట్టి బక్షించితి అరుణాచలా | 103 |

ప్రేమతో నీ నామ మాలించు

భక్త భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచలా | 104 |

ననుబోలు దీనుల నిం పొంద

కాచుచు చిరజీవివై బ్రోవు అరుణాచలా | 105 |

ఎముకలరుగు దాసు మృదు వాక్కు విను

చెవిన్ గొనుమ నా యల్పోక్తు లరుణాచలా | 106 |

షమగల గిరి యల్ప వాక్కు సద్వాక్కుగ

గొని కావు మరి యిష్ట మరుణాచలా | 107 |

మాలను దయచేసి యరుణాచలరమణ

నా మాల దాల్చి బ్రోవు అరుణాచలా | 108 |

మాలను దయచేసి యరుణాచలరమణ

నా మాల దాల్చి బ్రోవు అరుణాచలా

అరుణాచల శివ ||3|| అరుణాచలా ||2||

Arunacahala Shiva Song in Telugu Watch Video

Sharing Is Caring: